నాని హీరోగా దర్శకుడు బలగం వేణు సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. నాని, బలగం వేణు ప్రాజెక్ట్ గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్ గా వేణు తన స్క్రిప్ట్ తో నాని కన్విన్స్ చేశాడని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కు నాని ఓకే చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెడుతున్నారు.
తెలంగాణలోని ఓ గ్రామంలో జరిగే ప్రేమకథతో వేణు ఈ సినిమాను రూపొందించనున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. 90 దశకం నేపథ్యంతో మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి వేటికవి భిన్నమైన స్టోరీస్ చేస్తున్న నానికి పీరియాడిక్ లవ్ స్టోరీ మూవీ ఒక రీఫ్రెషింగ్ గా ఉండబోతోంది. బలగం సినిమాతో ప్రతి ఊరునూ కదిలించిన దర్శకుడు వేణు ..ఈ సినిమాతో తన మంచి పేరును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.