బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ రిలీజ్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.
బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ – మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. చిరంజీవి ని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసిన చిరంజీవి ని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు శివుడిలా భావిస్తా. పరాక్రమం సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణ తో కూడుకున్న కథ. నేను గతంలో నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్ గానే మీ ముందుకు వచ్చాయి.
చదవండి:‘శివం భజే’ ట్రైలర్ లాంచ్
ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ ఈ పరాక్రమం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారికి థాంక్స్ చెబుతున్నా. అన్నారు.