యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడలతో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా లాంఛ్ అయ్యింది. అయితే మేకర్స్ అఫీషియల్ గా న్యూస్ రిలీజ్ చేయలేదు. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల టాలీవుడ్ నుంచి ఆమెకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడీ సినిమాతో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది మెహరీన్.
నాంది సినిమాతో అల్లరి నరేష్ కు మంచి హిట్ ఇచ్చారు విజయ్ కనకమేడల. సోషల్ ఇష్యూను ఎమోషనల్ గా చూపించిన ఈ సినిమా హిట్ కొట్టింది. ఇప్పుడు అలాంటి సోషల్ మెసేజ్ ఉన్నబలమైన కథతో బెల్లంకొండ హీరోగా విజయ్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ డాక్టర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.