యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమాకు టైసన్ నాయుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ కు తగినట్లే ఇందులో హీరో బెల్లంకొండ బాక్సింగ్ చేస్తుంటాడు. పోలీస్ అధికారిగా డీఎస్పీ హోదాలో ఉన్నా..బాక్సింగ్ తో విలన్స్ పై విధ్వంసంలా పడుతుంటాడు.
ఇవాళ బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా టైసన్ నాయుడు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో యాక్షన్ పార్ట్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందిస్తున్నారు. రీసెంట్ గా టైసన్ నాయుడు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఫ్లస్ సంస్థ నిర్మిస్తోంది. టైసన్ నాయుడులో నటించే హీరోయిన్, ఇతర ఆర్టిస్టుల డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నారు.