యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు యాక్షన్ హీరోగా పేరుంది. యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటించి తెలుగుతో పాటు హిందీ మార్కెట్ పెంచుకున్నాడు బెల్లంబాబు. ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్…ఈరోజు తన కొత్త సినిమాను లాంఛనంగా మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకుంది.
బెల్లంకొండ నటిస్తున్న ఈ 11వ చిత్రానికి బీస్ఎస్ 11 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.