సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరు పేరు భైరవ కోన. ఈ చిత్రాన్ని దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నెల 9వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు.
ఊరు పేరు భైరవకోన ట్రైలర్ ఎలా ఉందో చూస్తే….హీరో హీరోయిన్ల మధ్య లవ్ మేకింగ్ సీన్స్ తో ట్రైలర్ ప్రారంభమై..ఆ తర్వాత భైరవకోనను పరిచయం చేశారు. గరుడపురాణంలో యామమైన నాలుగు పేజీలో భైరవకోన అంటూ ఆ ఊరు ప్రత్యేకతను వివరించారు. కర్మ సిద్ధాంతాన్ని దేవుడైనా తప్పించలేడు, విధి రాసినట్లు జరగాల్సిందే అనే డైలాగ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. భైరవకోన ఊరు అనేక వింతలకు నిలయంగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ హింస అనివార్యం. దాన్ని ఆపడానికి చేసే కథానాయకుడి ప్రయత్నాలు ఏమయ్యాయి అనేది ఆసక్తికరంగా చూపించారు.