గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కనిపిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ భీమా సినిమాను నిర్మిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. భీమా సినిమా వచ్చే నెల 16న థియేటర్స్ లోకి రాబోతోంది.
భీమా సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే…గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంతో భీమా పాత్రలో హీరోను పరిచయం చేశారు. రాక్షసుల్ని చంపేందుకు బ్రహ్మరాక్షసుడు వచ్చేశాడు అంటూ హీరో క్యారెక్టర్ కు బిల్డప్ ఇచ్చారు. దున్నపోతు మీద యముడిలా ఉన్న భీమాను చూస్తే శత్రువులు ఎలా భయపడతారో టీజర్ లో కన్వే చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.