టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి ట్వీట్ చేశారు నాగార్జున. అంతులేని వినోదం కోసం సిద్ధమవండి అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయనే ఈ సారి కూడా హోస్ట్ గా ఉండబోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
త్వరలో బిగ్ బాస్ స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. వీక్ కంటెస్టెంట్స్, ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోవడంతో బిగ్ బాస్ మీద క్రేజ్ పోయింది. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనేది త్వరలో బిగ్ బాస్ టీమ్ ప్రకటించనుంది.