బిగ్ బాస్ సోహైల్ కొత్త సినిమా బూట్ కట్ బాలరాజుకు నిన్న రిలీజైంది. ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ థియేటర్స్ కు వెళ్లడం లేదు. పబ్లిసిటీ, రిలీజ్ ప్రాపర్ గా జరగకపోవడంతో ఈ సినిమా జనాల్లోకి వెళ్లలేదు. సినిమా బాగుంటే మౌత్ టాక్ అయినా స్ప్రెడ్ అయ్యేది. కథలో కంటెంట్ లేకపోవడంతో అదీ జరగడం లేదు. దీంతో సోహైల్ ఫ్రస్టేషన్ తో ఆడియెన్స్ నే తిడుతున్నాడు. మంచి సినిమా చేసినా థియేటర్స్ కు జనం రావడం లేదని బ్లేమ్ చేస్తున్నాడు.
అతి తక్కువ థియేటర్స్ తో రిలీజైన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా ..మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. స్ట్రైట్ సినిమాలే కాదు ఎంగేజ్ చేసేలా ఉంటే డబ్బింగ్ సినిమాలూ చూసేస్తారు. సినిమా బాగుంటే దాని సక్సెస్ ను ఎవరూ ఆపలేరు. సోహైల్ ఈ సినిమాకు డబ్బులు పెట్టాడు. కాబట్టే ఇంత బాధపడుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు శ్రీ కోనేటి రూపొందించారు. గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మించారు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ కీ రోల్స్ చేశారు.