నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్. ఇవాళ బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఉధిరన్ లుక్ రిలీజ్ చేశారు. ‘రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్ ..’ అంటూ ఉధిరన్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ బాబీ డియోల్ కు బర్త్ డే విశెస్ చెప్పారు మేకర్స్.
ఈ పోస్టర్ లో బాబీ డియోల్ ఉధిరన్ గా యూనిక్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్ కు ఆయన వర్గం ప్రజలంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. విజువల్ వండర్ గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు ‘కంగువ’ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతోంది