“మెకానిక్ రాఖీ” వర్సెస్ “లక్కీ భాస్కర్”

Spread the love

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న తెలుగు సినిమా లక్కీ భాస్కర్. ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అయితే.. ఈసారి మెకానిక్ రాఖీతో పోటీకి సై అంటున్నాడు లక్కీ భాస్కర్. అసలు లక్కీ భాస్కర్ వాయిదాపడడానికి కారణం ఏంటి..?

దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా నటిస్తోన్న లక్కీ భాస్కర్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకీ అట్లూరి ఫస్ట్ లో ఒకే తరహా చిత్రాలు చేసినా.. ఇప్పుడు రూటు మార్చి డిపరెంట్ మూవీస్ చేస్తున్నాడు. సార్ మూవీ వలే లక్కీ భాస్కర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. వాయిదా వేశారు. ఇంతకీ.. లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31. ఈ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

చదవండి: ప్రభాస్, హను స్టోరీ వెనకున్న అసలు నిజం ఏంటంటే ?

అయితే.. అక్టోబర్ 31న విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాఖీ విడుదల కానుంది. ఆ మధ్య ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తన కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విశ్వక్ సేన్ చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి డేట్ కావడంతో ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కుతుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడు లక్కీ భాస్కర్ అదే డేట్ కి వస్తుండడంతో పోటీ తప్పలేదు. ఈ రెండు సినిమాల మధ్యే పోటీ అనుకోవడానికి లేదు.

ఆ టైమ్ కి ఏ పాన్ ఇండియా మూవీ అయినా రావచ్చు. లేదా తెలుగులో మరో సినిమా పోటీకి రావచ్చు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలు లక్కీ భాస్కర్ ఎందుకు వాయిదా వేసారంటే.. విజయ్ గోట్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా భారీగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారని టాక్. మరి.. మెకానిక్ రాఖీ, లక్కీ భాస్కర్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...