వరదసాయంపై జగన్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. వరదసాయంపై ప్రభుత్వం వైఫల్యమైందంటూ జగన్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన బ్రహ్మాజీ వాళ్ల వల్ల కాదు మనం చేద్దాం. ముందు ఒక వెయ్యి కోట్లు విడుదల చేద్దాం. మనకు అధికారం కాదు ప్రజలు ముఖ్యం, వైకాపా క్యాడర్ ను రంగంలోకి దించుదాం అంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్ చేశారు.
చదవండి: ఇంట్లో ప్రియురాలు..వీధిలో ఇల్లాలు..!
బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజన్స్ కూడా బ్రహ్మాజీని సపోర్ట్ చేస్తూ జగప్ పై విమర్శలతో పోస్టులు చేశారు. తన ట్వీట్ సెన్సేషన్ కావడంతో బ్రహ్మాజీ స్పందించారు. ఆ ట్వీట్ తను చేసింది కాదని, తన అక్కౌంట్ హ్యాక్ అయ్యిందని మళ్లీ ట్వీట్ చేశారు. అక్కౌంట్ హ్యాకింగ్ పై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు బ్రహ్మాజీ పేర్కొన్నారు.
గతంలో హైదరాబాద్ వరదల టైమ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత తన ట్విట్టర్ అక్కౌంట్ కొంతకాలం బ్లాక్ చేసుకున్నారు బ్రహ్మాజీ.