పద్మ శ్రీ , హాస్యబ్రహ్మా బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా బ్రహ్మ ఆనందం . ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను రక్షా బంధన్ సందర్భంగా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఇటీవలే రిలీజ్ చేసిన బ్రహ్మానందం లుక్ కు మంచి అప్లాజ్ వస్తుంది. ట్రెడిషినల్ లుక్లో బ్రహ్మీ అవతార్ అదిరిపోయింది అంటున్నారు ఆడియన్స్.
ఈ సినిమాలో బ్రహ్మానందం , రాజా గౌతమ్ తాతా, మనవళ్లుగా నటిస్తున్నారు. అవసరాల కోసం ఇబ్బందిపడుతున్న యువకుడిగా రాజా గౌతమ్ నటిస్తుంటే, పోగ్రస్ లేని డాక్టర్గా హీరో ఫ్రెండ్గా వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు. ఇక అన్ని సమస్యలు పరిష్కరించే అల్టిమేట్ బాస్గా బ్రహ్మీ నటిస్తున్నారు.
మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద వంటి హిట్ సినిమాలను అందిచిన ఈ ప్రోడక్షన్ హౌస్ నుండి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్లో అంచనాలు బాగానే ఉంటాయి, కనుకు ఓ యునిక్ కాన్సెప్ట్తో డిసెంబర్ 6 న బ్రహ్మ ఆనందం తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము అని చెబుతునారు చిత్ర నిర్మాతలు . ఆర్.వి.యస్ నిఖిల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.