ఓటీటీ కంటెంట్ ను పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అడ్వెంచర్స్, యానిమేషన్, సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇలా పిల్లల్ని ఎంటర్ టైన్ చేసే మరో సినిమా నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అదే అల్లు శిరీష్ నటించిన బడ్డీ.
బడ్డీ ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది. బడ్డీ నేటి నుంచి చూడండి అంటూ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది. బడ్డీ సినిమా అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చింది.
చదవండి: “మురారి” రికార్డ్ పై కన్నేసిన “గబ్బర్ సింగ్”
హ్యూమన్ ట్రాఫికింగ్ అనే సీరియస్ ఇష్యూ నేపథ్యంలో లవ్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కలిపి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శామ్ ఆంటోన్. బడ్డీలో టెడ్డీ బేర్ క్యారెక్టర్ చేసిన యాక్షన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. బడ్డీ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు.