ఈ శుక్రవారం ఆయ్ సినిమా ప్రెస్‌మీట్ లో భాగంగా విలేఖరులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిర్మాత బన్నీ వాసు . పవన్ కళ్యాణ్, బన్నీకి మధ్య గ్యాప్ గురించి అలాగే పుష్ప 2 షూటింగ్ డిలే గురించి సరైన క్లారిటీ ఇచ్చారు. అలాగే అందరి హీరోలు తమ నెక్ట్ సినిమాలు ఫిక్స్ చేసుకుంటుంటే, బన్నీ ఎందుకు ఫిక్స్ చేసుకోలేదు అనే ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తమిళ దర్శకులు అయిన నెల్సన్, అట్లీ తో సినిమాలు చేద్దాం అని అల్లు అర్జున్ అనుకున్న మాట వాస్తవమే కానీ పుష్ప 2 డిసెంబర్ 6 కు రిలీజ్ వాయిదా పడటంతో పరిణామాలు అన్నీ మారిపోయాయి. ఆ దర్శకులు కూడా వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు.అందువల్ల ఆ ప్రాజెక్ట్స్ వర్క్ అవుట్ కాలేదు అని చెప్పారు.
చదవండి: అల్లు అరవింద్ కాల్ చేస్తే ఎన్టీఆర్ ఎమన్నాడంటే?
ఇక అలా వైకుంఠపురం తరువాత బన్నీ , త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని అందరూ అనుకున్నారు..రీసెంట్‌గా త్రివిక్రమ్‌గారు బన్నీకి ఓ లైన్ చెప్పడం, అది బన్నీ ఓకే చేయడం జరిగిపోయింది..అసలు విషయం ఏమిటంటే..ఆ సినిమా కథ భారీ బడ్జెట్ తో కూడుకుంది. అందుకే అల్లు అరవింద్ గారు, హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ చినబాబు గారు ఈ కథ మీద బాగా కసరత్తులు మొదలు పెట్టారు. అలాగే భారీ బడ్జెట్ కాబట్టి ఫైనాన్షియర్స్ ను వెతికే పనిలో ఉన్నారు అంటూనే ..ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ కే ఏడాదిన్నర పడుతుంది అని చెప్పారు నిర్మాత బన్నీ వాసు. ఇదే గానీ వర్క్ అవుట్ అయితే బన్నీకి, త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది అంటున్నారు బన్నీ వాసు.