కల్కి సినిమా రేపు ఘనంగా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ భారీగా ఉంటాయనే అంతా ఊహిస్తున్నారు. ఆ నెంబర్ ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్స్ ను మించే ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా 223 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకు రాజమౌళితో కలిసి ముగ్గురు హీరోలు.
ఇటు కల్కి విషయానికి వస్తే నాగ్ అశ్విన్ కు క్రేజ్ ఉన్నా అది రాజమౌళి అంత కాదు. కాబట్టి ప్రభాస్ సోలోగానే హయ్యెస్ట్ ఓపెనింగ్ డే ఫీట్ సాధిస్తాడా అనేది చూడాలి. కల్కి ఓపెనింగ్ డే 200 కోట్ల దాకా వసూళ్లు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఆ నెంబర్ మార్నింగ్ షోస్ టాక్ ను బట్టి పెరగొచ్చు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా కల్కి ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్స్ ను దాటేస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 4 మిలియన్ డాలర్స్ విలువైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ రికార్డ్ ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి దక్కలేదు.