హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది.
సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు. అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది.