అనవసర ప్రేమ వివాదంతో టాలీవుడ్ లో కెరీర్ ముగిసేలా చేసుకుంది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. హిందీలో సీరియల్స్, ఒకట్రెండు సినిమాల్లో నటించిన మాల్వీ..తిరగబడరా సామీ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. హీరో రాజ్ తరుణ్ తో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టి పెద్ద ఊబిలో ఇరుక్కుంది. మాల్వీ మల్హోత్రా గురించి ఇంత పెంట జరిగాక మరో హీరో, నిర్మాత ఆమెను సినిమాలో పెట్టుకుంటాడా అనేది సందేహమే.
తాజాగా మాల్వీ, ఆమె సోదరుడిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో పాటు వీరికి కూడా నోటీసులు ఇచ్చారు. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మాల్వీ మల్హోత్రా సోదరుడిని రిజిస్టర్ చేశారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, లక్షల రూపాయల డబ్బు తీసుకున్నాడని, మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నాడని కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య.