విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నుంచి కాస్టింగ్ కాల్ (Casting call) ఇచ్చారు. ఈ సినిమాను వీడీ 12 (VD 12) వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri venkateswara creations)లో దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా (Ravikiran kola) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆల్ ఏజ్ గ్రూప్స్ లో టాలెంటెడ్ యాక్టర్స్ కు తమ సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది వీడీ 12 టీమ్
మీకు నటన వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదారి యాసొత్తే ఇంకాపేవోడేలేడు అంటూ ఈ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ (Family star) సినిమా తర్వాత వెంటనే దిల్ రాజుతో విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన ఈ సినిమా సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సెప్టెంబర్ నుంచి వీడీ 12 సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ను ఇంకా ఎంపికచేయలేదు.