ప్రేక్షకులకు నా పేరు తెలియకున్నా జయమ్మ, భానుమతి అంటూ నేను చేసిన క్యారెక్టర్స్ పేర్లతో పిలుస్తారు. నటిగా నాకు ఇదే పెద్ద అవార్డ్ అంటోంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించారు. సూపర్ హీరో కథతో తెరకెక్కిన హనుమాన్ గురించి, తన కెరీర్ విశేషాల గురించి వరలక్ష్మీ రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ – నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం వుటుందనే పేరు వచ్చింది. ఆ పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. హనుమాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా వుంటుంది. కొంతమంది ప్రేక్షకులకు నా పేరు తెలీదు. వాళ్ళు నన్ను జయమ్మ, భానుమతి అని పిలుస్తారు. ఇదే నాకు అసలైన అవార్డ్. హనుమాన్ ప్రీ రిలీజ్ లో చిరంజీవి గారు నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డ్ లా అనిపించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను. అని చెప్పింది.