మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ షూటింగ్ జరిపారు. రెండో షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొననున్నారు. ఆయన మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోనందున షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నారు.
విశ్వంభర నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. యూట్యూబ్ వ్యూస్ లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విశ్వంభర మూవీ నుంచి తాజా అప్డేట్ ఒకటి తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు దొరబాబు. దొరబాబు పేరులోనే ఒక దర్పం కనిపిస్తోంది. అయితే ఆ పేరుకు తగినట్లే చిరంజీవి క్యారెక్టర్ ఉంటుందా లేక అమాయకంగా ఉంటూ ఫన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.