బెంగళూరులోని రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో చిరంజీవి కుటుంబం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంది. ఈ సంబరాల్లో మొత్తం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయ పర్యటనలు ఉన్నందు వల్ల పవన్ కల్యాణ్ మాత్రం ఈ సెలబ్రేషన్స్ కు రాలేకపోయాడు. పవన్ కొడుకు అఖిరా, కూతురు తండ్రి తరుపు ఫ్యామిలీతో కలిసిపోయారు. తల్లిదండ్రులు విడిపోయినా..వీరు మాత్రం తమ కుటుంబానికి దగ్గరగానే ఉంటున్నారు.
ఈ సెలబ్రేషన్స్ లో మహిళలంతా రెడ్ కలర్ చీరలు, దుస్తులు, మగవాళ్లు వైట్ డ్రెస్ తో వచ్చారు. గత నాలుగు రోజులుగా చిరంజీవి కుటుంబం బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మొత్తం మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు.