అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఆహ్వాన కమిటీ సభ్యులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ నెల 22న అయోధ్యలో అత్యంత వైభవంగా రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో సినిమా రంగం నుంచి కూడా పేరున్న వారిని పిలుస్తున్నారు. అలా చిరంజీవితో పాటు ఆయన కొడుకు, కోడలు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూడా ఈ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి కూడా కొందరు స్టార్ హీరోలు హీరోయిన్లు దర్శక నిర్మాతలు హాజరవుతున్నారు. వచ్చే నెల నుంచి చిరంజీవి తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్ లో పాల్గొంటారు.