అగస్ట్ 15 న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి..దానికంటే ముందు అగస్ట్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది కమిటీ కుర్రోళ్ళు . పూర్తి గోదావరి జిల్లాల్లో నిర్మించిన ఈ సినిమాకు నిహారిక కొణిదల తో రాధా దామోదర్ స్టూడియోస్లో నిర్మించారు. రిలీజైన దగ్గరనుండి ఈ కమిటీ కుర్రోళ్లు ఎక్కడా ఆగడం లేదు. కలక్షన్స్ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ సినిమా కోసం ధియేటర్స్ కూడా పెంచారు.. రిలీజ్ అయిన 4 రోజులకే బ్రేక్ ఇవెన్ అయింది ఈ సినిమా . ఈ సినిమా లో సీనియర్ ఆర్టిస్టులతో పాటు 11 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు దర్శక, నిర్మాతలు.
కమిటీ కుర్రోళ్లు ద్వారా దర్శకుడు యదు వంశీ కి నిర్మాతలు అవకాశం ఇస్తే , యదు వంశీ 11 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాడు.. గోదావరి జిల్లాల్లో ఉండే ప్రేమ, కాస్త ఎటాకారం , కొన్ని గొడవలు, కామెడీ..ఎవరూ టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయని రిజర్వేషన్ అంశాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు యదు వంశీ..అందుకే ఇండిస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు , దర్శకులు ఈ సినిమా గురించి ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నారు..
ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్లు చూసిన మెగాస్టార్ చిరంజీవి ..ఆ పదకుండు మంది కొత్త ఆర్టిస్టులను ఇంటికి పిలిచి అందరినీ పేరు , పేరున పలికరించి వాళ్లు చేసిన ఫెర్ఫార్మెన్స్ గురించి మెచ్చుకున్నారు..బేసిగ్గా చిరంజీవి ఫ్యాన్స్ అయిన ఆ కమిటీ కుర్రోళ్లు ఆనందానికి అవదులు లేవు.
ఈ సినిమాను కాంపాక్ట్ బడ్జెట్ లో చాలా బాగా తెరకెక్కించారు.. కొత్త వాళ్లు అయిన చాలా చక్కగా నటించారు..అందరకీ మంచి భవిష్యత్తు ఉంటుంది.. యదు వంశీ చక్కటి ప్లానింగ్తో ఈ సినిమాకు ఇంతటి విజయం దక్కింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి .
కమిటీ కుర్రోళ్ళు కు మెగాస్టార్ పిలుపు
Popular Categories