అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రామ్ చరణ్ చిరంజీవి సతీమణి సురేఖ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి కుటుంబ సభ్యులకు అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులు ఆహ్వానం పలికారు. చిరంజీవి కుటుంబంతో ఫొటోస్ తీసుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి, రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, తాను ఆంజనేయుడి భక్తుడిని కావడం వల్ల ఆ హనుమంతుడే తనకు ఆహ్వానం పలికినట్లు భావిస్తున్నా అని అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ మహత్తర సందర్భం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. చిరంజీవి అయోధ్యలో ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీతో చాలా సేపు మాట్లాడుతూ కనిపించారు.