మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి మరో అరుదైన గుర్తింపు, గౌరవం దక్కనున్నాయి. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డ్ ఇస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవికి ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. తాజాగా పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
2006లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ దక్కింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి పెద్ద సన్మానం జరిపారు. దీనికి అమితాబ్ బచ్చన్ అతిథిగా హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. ఆ తర్వాతే మెగాస్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కరోనా టైమ్ లో చిరంజీవి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డ్ ను ఆయనకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పద్మవిభూషణ్ మన దేశంలో భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పౌరపురస్కారం.