తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా చిరంజీవి, బాలకృష్ణ మధ్యే పోటీ ఉండేది. అంతలా ఫ్యాన్స్ కూడా.. కటౌట్‌లు పెట్టిమరీ తమ అభిమాన హీరోను కొలుచుకునేవారు. మరోవైపు, ఆ రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్యే కాదు…మొన్నటివరకు ఆ ఇద్దరి హీరోల మధ్య కూడా పొరపచ్చాలు ఉన్నాయి, అందుకే వారిద్దరూ ఒకే వేదికపై కనిపించరు అనేవారు కూడా లేకపోలేదు.
అయితే, వారి కుటుంబాల్లోంచి వచ్చిన నేటితరం హీరోలు అహంభావాల్ని పక్కనపెట్టి, మల్టీస్టారర్ మూవీస్ చేసి ఇటు అభిమానుల్లో ఉన్న పక్షపాత వైఖరిని, ఇండస్ట్రీలో నెలకొన్న నిశ్శబ్ధ పోరుకు తెరదించడంతో కొన్నాళ్లుగా తెలుగుసినీ కళామతల్లి ఒడిలో అందరూ సంతోషంగా సేదతీరుతున్నారు. ఇక ఇదే విషయం కొనసాగింపుగా, ఆ ఇద్దరు బడా స్టార్స్ త్వరలో ఒకేవేదికపై కనిపించడం మరింత ఆనందాన్ని కలిగించే విషయం అంటున్నారు ఈ విషయం తెలిసిన వారందరూ.
చదవండి: బాబు రాక.. ఏపీకి మంచిరోజులు?
బాలయ్య ఫంక్షన్…చిరంజీవి యాక్షన్.! సెప్టెంబర్ 1న క్లాప్..?
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రంగప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఇందుకుగాను ఇండస్ట్రీకి చెందిన నాలుగు ప్రధాన రంగాల ప్రముఖులంతా ఐక్యమై… బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్‌ని పిలవాలని నిర్ణయించుకున్న సదరు ఇండస్ట్రీ పెద్దలు…చిరంజీవి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన..వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. సో, సెప్టెంబర్ 1న హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో జరగబోయే ఈ కార్యక్రమం… ఇరు వర్గాల అభిమానులకి ఓ జాతరే అంటున్నారు సినీ విశ్లేషకులు.