చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా “తంగలాన్” రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే మరింత క్వాలిటీ ఔట్ పుట్ తీసుకొచ్చేందుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని మేకర్స్ భావించారు. దాంతో “తంగలాన్” సినిమా విడుదలను ఏప్రిల్ కు మార్చారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన “తంగలాన్” టీజర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేశారు.