“పురుషోత్తముడు” క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్న దర్శక నిర్మాతలు

Spread the love

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో “పురుషోత్తముడు” చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్.

దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – ఒక న్యూస్ ఆర్టికల్ చదివి కొన్నేళ్ల కిందట ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేది “పురుషోత్తముడు” కథ. మహేశ్ బాబు శ్రీమంతుడు లాంటి సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి కదా అనిపించవచ్చు. మన దగ్గర కథ లైన్ గా అనుకుంటే ఎన్నో సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. కానీ ఆ కథలో ఏం చెప్పాం అనేది ముఖ్యం. “పురుషోత్తముడు” సినిమాలో ఇప్పటిదాకా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని పాయింట్ ను టచ్ చేశాం. హీరో రాజ్ తరుణ్ తన పూర్తి సపోర్ట్ మూవీకి అందించారు. హీరోయిన్ హాసినీ సుధీర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి తన రోల్ పర్పెక్ట్ గా చేసింది. హోల్ సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా – అన్నారు.

చదవండి: సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్న “ఆపరేషన్ రావణ్”

నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ- సినిమా కోసం నిర్మాతలుగా ఎక్కడా రాజీ పడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముఖేష్ ఖన్నా లాంటి పేరున్న ఆర్టిస్టులను కీ రోల్స్ కోసం తీసుకున్నాం. గోపీసుందర్ మ్యూజిక్, చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణ కానుంది. హీరో రాజ్ తరుణ్ తన సపోర్ట్ అందించారు. హీరోయిన్ హాసినీ సుధీర్ తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయి. ఈ పాత్రకు చాలా బాగుంటుందని తీసుకున్నాం. రాజ్ తరుణ్ కు జోడీగా ఆమె బాగా కుదిరింది. “పురుషోత్తముడు” సినిమా సకుటుంబంగా ప్రేక్షకులంతా హాయిగా చూసేలా ఉంటుంది. ఇందులో ఎక్కడా వల్గారిటీ, చెడు అలవాట్లు చూపించడం వంటివి ఎక్కడా చేయలేదు. మా సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాం. ఈ నెల 26వ తేదీన మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Hot this week

Yogesh Kalle to Share Screen Space with Sunny Leone in Trimukha

*Debutant Hero Yogesh Kalle to Share Screen Space with...

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

Topics

Yogesh Kalle to Share Screen Space with Sunny Leone in Trimukha

*Debutant Hero Yogesh Kalle to Share Screen Space with...

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....