మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆయన కోడలు ఉపాసన పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ లీడర్ కవిత, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. సీఎం రేవంత్ ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఇతర మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ అభినందన సభ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఆయనను కలిసివారిలో చిరంజీవి మొదటివారు. ఆయన తర్వాతే వెంకటేష్, సురేష్ బాబు వెళ్లారు. పద్మవిభూషణ్ ప్రకటించిన మరుసటి రోజే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే ప్రభుత్వం తరుపున చిరంజీవికి ఓ సన్మాన సభ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.