నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందరి దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ 3.69 కోట్ల రూపాయలు రాబట్టింది.
చదవండి: వరుణ్ తేజ్ ‘మట్కా’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ చిత్రాన్ని ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై దర్శకుడు యదు వంశీ రూపొందించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యూత్ ఫుల్ డ్రామాగా ‘కమిటీ కుర్రోళ్ళు’ తెరకెక్కింది. కొత్త నటీనటులు కావడంతో టాక్ కు తగినట్లు కలెక్షన్స్ ఊపందుకోవడం లేదు.