అవునండీ…ఆగస్టు నెల అంతా గోదారోళ్లదేనండి. వాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదండి. బడా బడా డైరెక్టర్స్, పెద్ద ప్రాజెక్టులతో వచ్చిన సినిమాలన్నీ వాళ్ల ముందు దిగదుడుపు అయిపోయాయంటే నమ్మండి. కమిటీ కుర్రోళ్లంటూ వచ్చారండీ… ఏదో చిన్నసినిమా, పైగా అందులో నటించినోళ్లు అందరూ ఎవరికి తెలియదని చిన్న చూపు చూశారండి…అంతేనా, చిన్న బ్యానర్‌తో వచ్చిన ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోకయినా ఒక ఊపు ఊపేసిందంటే ఏమనాలండి..?. పైగా మెగా ఫ్యామిలీ, నాగబాబు కూతురు నిహారిక తీసిన చిన్న సినిమానే.. ఇప్పుడు హాట్ ఆఫ్ ద టాక్ అయిపోయిందంటే దమ్మున్న సినిమాను ఎవడు ఆపలేడండి అంటున్నారండి చూసినోళ్లంతా…అవునంటారా..కాందటారా..?. నిజమండి బాబు. ‘ఒక మనసు’ చిత్రంతో 2016లో పరిచయమైన మన నిహారిక మెల్లమెల్లగా నిర్మాతగా మారి, ఇప్పుడు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోందండి. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని మా నిహారిక బంగారం అనిపించుకునే స్థాయికి వెళ్లిపోయిందండి. ఆగస్టు 9న రిలీజైన ఈ చిత్రానికి…చానాళ్లకి మనసారా ఓ మంచి సినిమా చూశారాం బాబు అని ప్రేక్షకదేవుళ్లు ఓ పక్క ఆశీస్సులు అందిస్తుంటే…కాసుల వర్షంతో తడిచిముద్దైపోతున్నారండీ ఈ చిత్రం తీసినోళ్లు.
చదవండి: రవితేజకు సంక్రాంతి మిస్ అయినట్టే
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మన నిహారిక తీసిన కమిటీ కుర్రోళ్లు గురించి ఏం చెప్పుకున్నా తక్కువేనండి. కొత్తవాళ్లతో సాహసం చేసి సత్తా చాటిందండి. కొత్త డైరెక్టర్ యధు వంశీది మన తాడేపల్లి గూడెం అంటండి. ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే అతనికి మెగాఫోన్ ఇచ్చి డైరెక్ట్ చేయమందండి. రిజల్ట్ చూసాక నిర్మాత నమ్మకాన్ని వమ్ముచేయలేదని అనిపించిందండి మన గోదారబ్బాయ్. అంతలా చక్కగా తీసిపడేశాడు సినిమాని. పైగా ఎవరికి పెద్దగా తెలియని కొత్త నటులండి. పేరుకే కొత్తకానీ, వాళ్లకిచ్చిన పాత్రలకి న్యాయం చేసి ఇండస్ట్రీలో పదికాలాల పాటు పదిలంగా తమ పొజిషన్స్ కాపాడుకునేలా దుమ్ముదులిపేశారండీ..అంత బాగా యాక్ట్ చేశారు మరీ.
జనాలు ఊరకనే ఏ సినిమానూ మోయరండి….వాళ్లకి తెలుసండి సినిమా గురించి పూర్తిగా…పాపం ప్రమోషన్ల పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసలతో హైప్ క్రియేట్ చేస్తారుకానీ, ఒక్కసారి టికెట్ కొని, థియేటర్‌లోకి వెళ్లి సీటులో కూర్చున్న ప్రేక్షకుడే డిసైడ్ చేసేస్తాడండి…అది హిట్టా…ఫట్టా అని..ఇప్పుడూ అదే జరిగిందండి…ఆగస్టు 15న రిలీజైన మాస్ మహరాజా మిస్టర్ బచ్చన్ కావొచ్చు, పూరి డబుల్ ఇస్మార్ట్ కావొచ్చు, ఎక్కడో తమిళనాడు వచ్చిన తంగలాన్ మూవీ కావొచ్చు…అర్థనగ్నంగా కాదండి కావాల్సింది, మంచి సబ్జెక్ట్‌తో వచ్చి అర్థవంతంగా తీయగలగే సత్తా ఉన్నోళ్లదే రోజండి. కమిటీ కుర్రాళ్లు చిత్రం ప్రూవ్ చేసిందండి మరి అలాగా..!..చిన్న సినిమా అని తప్ప ఎందులోనూ తగ్గలేదండి…కథ కావొచ్చు, కథనం కావొచ్చు, కామెడీ ట్రాక్ కావొచ్చు…సీటులో కూర్చుని సినిమా చూస్తున్నవాళ్లకి సీన్‌లో వచ్చే సెంటిమెంట్‌తో ఏడుపొచ్చేసిందంటే నమ్మండి…అలా ఉందండి మరీ.. కమిటీ కుర్రోళ్లు. ఎదేమైనా, ఎంతచెప్పినా తక్కువేనండి ఈ సినిమా కోసం…చూడండి మీరే, ఈ రివ్యూ చూసిన మీరు కచ్చితంగా సినిమాకెళ్తే మళ్లీ మా వెబ్‌సైట్ తలుపు తెరవడం పక్కా, లైక్ కొట్టిమరీ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారనేది మా గట్టి నమ్మకమండి…ఆయ్…
ఆ కుర్రోళ్ల తర్వాతే మేమేనండీ…’ఆయ్’..!
గీతా ఆర్ట్స్ బ్యానర్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అల్లు అరవింద్ గారండి. ఇక, గీతా ఆర్ట్స్ 2 అంటే బన్నీ వాసే కదండి అందరికీ గుర్తొచ్చేది. కంటెంటెంతో వెళ్తారండీ ఈ బ్యానరోళ్లు. మొన్న ఇదే బ్యానర్‌లో వచ్చిన విజయ దేవరకొండ గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం కదండీ..చిత్రం ఏంటంటే అర్జున్‌రెడ్డిలో దేవరకొండను చూసినోళ్లోకి గీత గోవిందంలో మచ్చుకైనా అతడి కోపం కనపడకుండా శాంతికాముకుడిగా ఉన్న విజయ్‌ను పరిచయం చేసి పెద్ద హిట్ కొట్టారండి. ఇది మనకి తెలిసిందే కదండీ. ఇప్పుడు అదే బ్యానర్‌లో మన బన్నీ వాసు గారు కొత్త డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చిమరీ గోదారోళ్ల సత్తా ఏంటో స్క్రీన్‌పై చూపించారండి. ఇంతకీ మన డైరెక్టర్ పేరు మణిపుత్ర అండి. సేమ్ కమటీ కుర్రోళ్లులానే, నిహారిక ఎలాగైతే కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిందో, మన బన్నీవాసు గారు కూడా కొత్త డైరెక్టర్ మణిపుత్రకి అవకాశం ఇచ్చి ప్రూవ్ చేసుకోమన్నారు. అసలే కుర్రోడు…పైగా ఉడుకు రక్తం…అంతకిమించి అమలాపురం బుల్లోడు…మన అంజిబాబు. మెగాఫోన్ పట్టాడండీ…ఆగస్టు 15న రిలీజైన 3 బడాచిత్రాలను పక్కకునెట్టి కొట్టాడండీ హిట్టూ..మనోడు దెబ్బకి ఆ మూడు బడా సినిమాలు బలాదూర్ అయిపోయాయంటే నమ్మండి..అయితే ఈ సినిమాకు ఆయువుపట్టు చివరి అరగంటే అని చెప్పుకుంటాన్నరండోయ్…ఆ అరగంట సినిమా ప్రేక్షకుల హృదాయాలను అంతలా తాకిందంటండీ…మనసుకు నిండుగా ఓ మంచి సినిమా ఇచ్చారని ప్రేక్షకుల నుంచి నిర్మాతకి ప్రశంసలే ప్రశంసల అంటండి బాబూ…ఇక గీతఆర్ట్స్‌లో ఒక హిట్టు ఇచ్చిన మన కొత్త డైరెక్టర్ మణిపుత్ర భవిష్యత్తు మారిపోయిందని ఇప్పటకే అమలాపురంలో టాక్ నడుస్తోందండి…ఆయ్…!
చదవండి: అభయ కేసులో ట్విస్ట్..? సంజయ్ నిర్దోషన్న తల్లి..!
‘కుర్రోళ్లు’ దగ్గరికి వెళ్లలేకపోతున్నాం…ఎలా?
థియేటర్లు లేక పలుచోట్ల ప్రేక్షకుల నీరసాలు!
థియేటర్‌లోకి వెళ్లి ఫుల్ కలెక్ష్లన్ల స్వింగ్‌తో నడుస్తున్న కమిటీ కుర్రోళ్లు…కొన్ని ఊళ్లల్లో ప్రేక్షక దేవుళ్లకు దగ్గరకాలేకపోతున్నారట. దానికి కారణం లేకపోలేదు…మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, చివరికి ఆయ్ లాంటి బడా ప్రాజెక్టులు, పెద్ద నిర్మాతలు ముందుగా థియేటర్లను ఆక్యుపై చేసుకోవడమే దీనికి కారణం అంటున్నారు. అయితే చిన్నసినిమాగా వచ్చి అతిపెద్ద హిట్ కొట్టిన కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని చూసేందుకు వేరే ఊరెళ్లి మరీ చూస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. మరోవైపు ఉన్నపళంగా పడిపోయిన వసూళ్లతో ఇక థియేటర్‌లలో బడా చిత్రాలు రన్ చేయడం కష్టం కనుక, వాటి స్థానంలో మన కమటీ కుర్రోళ్లు జెండా పాతేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారని సినీ క్రిటిక్స్ గుడ్ న్యూస్ చెబుతున్నారు. అంతే కాకుండా రూ. 15.6 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’.. రెండో వారం కంటే మూడో వారంలో పెరుగుతున్న కలెక్షన్స్ అని చెబుతున్నారు నిర్మాతలు…ఈ సినిమా చూసిన తరువాత పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి..చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి అని..