నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రాజస్థాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండేలా బాబీ డిజైన్ చేశారని తెలిసింది. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.
అయితే.. ఈ మూవీని ముందుగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వలన డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ లో కాదు.. సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారని గుసగుసలు వినిపించాయి. సంక్రాంతికి రావడం పక్కా అని, మరోసారి చిరు, బాలకృష్ణ మధ్య పోటీ తప్పదని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అఖండ రిలీజైన డిసెంబర్ 2నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో బాలకృష్ణ మూవీ వచ్చేది డిసెంబర్లోనా..? జనవరిలోనా..? అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే.. డిసెంబర్ 6న పుష్ప 2 రావడం పక్కా కనుక.. బాలకృష్ణ మూవీ జనవరిలోనే వస్తుందని మరో వాదన కూడా వినిపిస్తోంది. మరి.. ఈ కన్ ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.