పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ సలార్ థియేటర్స్ లో ఉండగానే…ఈ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ ఎప్పుడనే చర్చ మొదలైంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 650 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు దక్కాయి. ఓవర్సీస్ లోనూ అదిరే కలెక్షన్స్ వస్తున్నాయి.
సలార్ సెకండ్ పార్ట్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరింత హోప్స్ తో ఉన్నారు. సలార్ 2 అదిరిపోతుందంటూ అటు ప్రభాస్, శృతి హాసన్ లాంటి స్టార్స్ చెబుతూ మరింత హైప్ తీసుకొస్తున్నారు. త్వరలో సలార్ 2 షూట్ మొదలుపెట్టే పనిలో ఉన్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. వీలైతే సలార్ 2 ను ఈ ఇయర్ ఎండ్ కల్లా లేకుంటే నెక్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.