భార్య మామూలుగా ఉంటేనే సమస్యలు ఎదుర్కొనే భర్త…ఆమె వింతగా ప్రవర్తిస్తే ఏమవుతాడో అర్థం చేసుకోవచ్చు. ప్రియదర్శికి అలాంటి కష్టాలే వచ్చాయి. ఏరి కోరి చేసుకున్న భార్య వింతగా ప్రవర్తిస్తూ చితక్కొట్టుడు కొడుతుంటే ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాక ఫ్రస్టేట్ అవుతుంటాడు. అప్పట్లో అపరిచితుడు సినిమాలోలాగ నభా నటేష్, ప్రియదర్శి జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమాలోనూ ఇదే ఫార్ములాను అప్లై చేశాడు దర్శకుడు అశ్విన్ రామ్.
హీరోయిన్ నభాకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు చూపించాడు. అప్పటిదాకా బాగానే ఉన్న నభా..భర్త ప్రియదర్శిని ఉతుకుడు ఉతికేస్తుంటుంది. తనకు ఈ డిజార్డర్ ఉన్నట్లు కూడా ఆమెకు తెలియదు. ఈ రోజు రిలీజ్ చేసిన డార్లింగ్ ట్రైలర్ లో అపరిచితురాలిగా నభా హంగామాను చూపించారు. భార్య చేతిలో తన్నులు తినే భర్తగా ప్రియదర్శి సెట్ అయ్యాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.