కూతురు ‘దువా’ను పరిచయం చేసిన దీపికా-రణవీర్..!
సెప్టెంబర్ 8, 2024న తన మొదటి బిడ్డకు దీపికా పదుకొణె జన్మనిచ్చిన విషయం విదితమే. అయితే, రణవీర్-దీపికా జంట తమ బంగారుతల్లితోపాటు ఆమె పేరును దీపావళి రోజు రివీల్ చేశారు. పాపయొక్క పాదాల ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన దీపికా పదుకొణె…ఆమె పేరును ‘దువా పదుకొణె సింగ్’ గా నామకరణం చేసినట్టు వెల్లడించింది. ‘దువా’ అంటే ప్రార్థన అని వివరించింది దీపికా.
ఇదిలాఉంటే, రామ్‌లీలా సినిమా షూటింగ్‌లో దీపికా-రణవీర్ ప్రేమించుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేశాక 2018లో ఒక్కటైంది ఈ జంట. వీరిద్దరు ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు రెండు పద్ధతిలో వివాహాలు జరిగాయి. ఒకటి దక్షిణ భారతశైలిలో, మరొకటి సింధీ పద్దతిలో జరిగాయి. పెళ్లయిన ఆరేళ్లకి తమ మొదటి బిడ్డను స్వాగతించింది దీపికా-రణవీర్ జంట. సెప్టెంబర్ 7న పురిటినొప్పులతో ఆస్పత్రులో చేరిన దీపికా సెప్టెంబర్ 8న ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే, నవంబర్ 1న విడుదలైన సింగమ్ ఎగైన్ థియేటర్లలో విడుదలైంది. సింబా పాత్రలో మెప్పించాడు రణవీర్. విలన్‌గా నటించిన అర్జున్‌కపూర్‌తో తలపడి పరోక్షంగా సింఘమ్ అజయ్ దేవగన్‌కు సహాయపడతాడు.
ఇక, దీపికా పదుకొణె కూడా సింఘమ్ ఎగైన్ చిత్రంలో శక్తి శెట్టి అనే క్యారెక్టర్‌లో చిన్నపాత్ర చేసింది. ‘మైన్ సింఘమ్ నహీ, లేడీ సింఘమ్ హై’ అనే ప్రోమోలో దీపిక చెప్పిన డైలాగ్ ఇప్పటికే వ్యూయర్స్‌ను ఆకట్టుకుంది. మరోవైపు ఇప్పటికే దీపికా…కల్కి, ఫైటర్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అధికారికంగా దీపికా తన తదుపరి చిత్రం పేరు రివీల్ కాకున్నా… ‘ది ఇంటర్న్’లో దీపిక నటిస్తుందని ముంబై టాక్.