బాలీవుడ్ కపుల్స్ దీపికా పడుకునే, రణవీర్ సింగ్ ఇంట కొత్తకాంతులు విరజిమ్మాయి. వారి ఆరేళ్ల బంధానికి ప్రతీకగా అమ్మాయి పుట్టింది. తమకు ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు ఇద్దరూ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వెల్క్ బేబీ గాళ్ అంటూ ఇన్‌స్టాలో ప్రకటన వెల్లడించడంతో ఈ విషయం బయటపడింది.
చదవండి: జగన్ ను విమర్శిస్తూ బ్రహ్మాజీ ట్వీట్, తన అక్కౌంట్ హ్యాక్ చేశారంటూ మరో పోస్ట్
ఆరేళ్ల తర్వాత తొలిసంతానం..?
చాలాకాలం పాటు ప్రేమాయణం కొనసాగించిన దీపికా పడుకునే, రణవీర్‌సింగ్…2018 నవంబరులో ఒక్కటయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరికి తొలి సంతానం కలిగింది. ఈ నెల 7న ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి వెళ్లడంతోనే దీపిక ప్రసవంపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీపికా,రణవీర్ దంపతులకు ఇదే మొదటి సంతానం కావడంతో అందరి దృష్టి ఇటువైపే ఉండగా…ఆదివారంతో ఆ సందిగ్ధానికి తెరపడినట్లయింది. కాగా, మరోవైపు ఆమె ప్రెగ్నెన్సీలో ఉండగానే తానుచేసిన సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కూ దీపిక హాజరయింది. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రెగ్నెన్సీలో కనపడిన దీపికను చూసి అందరూ షాక్ అయిన విషయం విదితమే.