స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న డీప్ ఫేక్ సృష్టించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ లో రశ్మిక డీప్ ఫేక్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. జరా పటేల్ అనే మోడల్ ను రశ్మికలా మార్చి అసభ్యంగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు.
అచ్చు రశ్మికలా ఉన్న ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. రశ్మిక డూప్ లా ఉంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీసులు కూడా సుమోటోగా కేసు తీసుకున్నారు. డీప్ ఫేక్ వివాదం సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయొద్దంటూ సెలబ్రిటీలు చెప్పారు. రశ్మికకు ఇండస్ట్రీ నుంచి సానుభూతి వ్యక్తమైంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి ఈ డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో వెల్లడైంది.