ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ లో దేవర వరల్డ్ ను పరిచయం చేశారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. దేవర 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దేవర గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే…
సముద్రంలో పెద్ద షిప్ లో కంటేనర్స్ స్మగ్లింగ్ జరుగుతుంటుంది. కోట్ల రూపాయల విలువైన ఆ సామాగ్రి కోసం కత్తుల పోరాటం తప్పదు. ఈ పోరాటంలో దేవర నెత్తురు పారిస్తాడు. సముద్రాన్ని ఎరుపెక్కిస్తాడు. నీలి రంగు సముద్రం ఎర్రగా మారిపోతుంది. చివరలో ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసింది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో గ్లింప్స్ పవర్ ఫుల్ గా ముగిసింది. సినిమా విజువల్స్, ఎన్టీఆర్ లుక్, మేకింగ్ గ్రాండియర్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ పెక్ట్ చేసినంత లేదు.