ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ రోజున విడుదల చేశాక..థియేటర్స్ లోనూ ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న హనుమాన్ సినిమాతో దేవర గ్లింప్స్ ను అటాచ్ చేయబోతున్నారు. హనుమాన్ రిలీజయ్యే థియేటర్స్ లో దేవర గ్లింప్స్ ప్లే కానుంది. హనుమాన్ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవర పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది.