ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా గ్లింప్స్ ను ఈ నెల 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇయర్ ఆఫ్ ఫియర్ మొదలవుతోందంటూ మేకర్స్ దేవర మీద హైప్ పెంచే ప్రయత్నం చేశారు. గ్లింప్స్ అప్డేట్ లో ఎన్టీఆర్ కొత్త స్టిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.
దేవర గ్లింప్స్ కు ప్రస్తుతం ఫైనల్ టచింగ్స్ చేస్తున్నారు. ఈ గ్లింప్స్ లో డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇప్పటికే ఈ గ్లింప్స్ మీద హింట్ ఇచ్చాడు. దేవర సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.