టాలీవుడ్ బిగ్ మూవీస్ ఒక్కొక్కటిగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. అఫీషియల్ గా మూవీ టీమ్స్ అనౌన్స్ చేయకున్నా…ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ మాత్రం పుష్ప 2, దేవర రెండు సినిమాల రిలీజ్ వాయిదా పడ్డాయనే చెబుతోంది. ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాను రెండు భాగాలుగా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిఉంది. అయితే ఈ డేట్ కు సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదనే టాక్ మొదలైంది.
పుష్ప 2 రిలీజ్ కావాల్సిన ఆగస్ట్ 15న దేవర రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దేవర క్లైమాక్స్ షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు చేయాల్సిన సీజీ వర్క్ భారీగా ఉండటం, అటు సైఫ్ అలీఖాన్ గాయపడటం వంటివి దేవర రిలీజ్ పోస్ట్ పోన్ కు రీజన్స్ గా చెప్పుకోవచ్చు. సైఫ్ విలన్ గా నటిస్తున్నారు కాబట్టి ఆయనతోనే క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి. సైఫ్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన కోలుకుని సెట్స్ లో అడుగుపెట్టేవరకు దేవర టీమ్ వెయిట్ చేయాల్సిందే.