మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తే అతనికి గౌరవం ఇచ్చే తీరు వేరే ఉంటుంది. స్క్రీన్ మీద హీరోలా చూపించి అతన్ని ఖుషి చేద్దామనుకుంటే మొత్తం సినిమాకే బ్యాడ్ అవుతుంది. దేవర టీమ్ ఇదే అనుభవాన్ని ఫియర్ సాంగ్ విషయంలో ఎదుర్కొంది. అనిరుధ్ ను సంతోషపెట్టాలని అతని విజువల్స్ హీరో ఎన్టీఆర్ కు సమానంగా ఈ పాటలో పెట్టారు. దాంతో అతని మేకోవర్, దేవర గెటప్ కు ఏమాత్రం కుదరక పాట మొత్తం పాడైంది.
ఇప్పుడీ తప్పు దిద్దుకుంది దేవర టీమ్. ఈ రోజు రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ లిరికల్ వీడియోలో అనిరుధ్ విజువల్స్ 90 పర్సెంట్ కట్ చేశారు. యానిమేటెడ్ విజువల్స్ తో ఆ స్పేస్ ను ఫిల్ చేశారు. ఒకట్రెండు చోట్ల మాత్రమే అనిరుధ్ విజువల్స్ ఉంచారు. ఇప్పుడీ పాటకు వచ్చే రెస్పాన్స్ కోసం దేవర టీమ్ ఎదురుచూస్తోంది. ఫస్ట్ సాంగ్ తో ఇంప్రెస్ చేయాల్సిన దేవర ఇలా విమర్శలకు గురికావడం మొత్తం ప్రాజెక్ట్ మీదే ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సెప్టెంబర్ 27న దేవర స్క్రీన్స్ మీదకు వస్తోంది.