కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగార్జున ఓ కీ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
సొసైటీలో ధనవంతులకు, పేదలకు మధ్య ఎంత తేడా ఉంది, ఈ వ్యత్యాసం మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందనే నేపథ్యంతో సందేశం, వినోదం కలిపి శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సోషల్ ఇష్యూస్ తో ప్లెజెంట్ మూవీస్ చేసే శేఖర్ కమ్ముల ఈసారి కూడా తన మార్క్ చూపించబోతున్నారు. తెలుగు మార్కెట్ వరకు ధనుష్ కు ఈ సినిమా కీలకం కానుంది.