మెగాస్టార్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. భారీ, క్రేజీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న విశ్వంభర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే.. ఎవరైనా వెంటనే ఓకే చెబుతారు కానీ.. క్రేజీ హీరోయిన్ చిరు మూవీకి నో చెప్పిందట. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు..? నో చెప్పడం వెనకున్న అసలు నిజం ఏంటి..?
విశ్వంభర మూవీలో చిరుకు జంటగా త్రిష నటిస్తోంది. త్రిషతో పాటు ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండే సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమా పై ఫస్ట్ నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతారని టాక్ వినిపిస్తోంది. యు.వీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారు.
ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం క్రేజీ హీరోయిన్ శ్రీలీలను కాంటాక్ట్ చేశారట. అయితే.. ఈ అమ్మడు నో చెప్పిందట. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా నో చెప్పిందట. కారణం ఏంటంటే.. శ్రీలీల మంచి డ్యాన్సర్ అనే పేరు తెచ్చుకుంది కానీ.. పర్ ఫార్మెన్స్ పరంగా ఇంకా మెప్పించాలి. ఈమధ్య ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీమేన్ చిత్రాల్లో నటిస్తే ఈ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. గుంటూరు కారం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకనే ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. సరైన సినిమాలో ఓ మంచి పాత్ర చేసి మెప్పించాలి అనుకుంటుందట. పైగా స్పెషల్ సాంగ్స్ చేస్తే.. అలాంటి ఆఫర్సే వస్తాయని చేయకూడదని ఫిక్స్ అయ్యిందట. అందుకనే నో చెప్పిందట. మరి.. శ్రీలీల నో చెప్పిన ఈ స్సెషల్ సాంగ్ ఏ హీరోయిన్ తో చేస్తారో చూడాలి.