వైష్ణవ్ తేజ్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

Spread the love

ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కలెక్ట్ చేశాడు. అతనే మెగాస్టార్ మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఆతర్వాత చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఆదికేశవ సినిమా రిలీజై చాన్నాల్లు అయ్యింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మూవీ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఎవరితో..?

ఉప్పెన సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ఇండస్ట్రీకి యూత్ హీరో దొరికాడు అనుకున్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ఉప్పెన తర్వాత క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం అనే సినిమా చేశాడు. నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా ఫరవాలేదు అనిపించింది కానీ.. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఆతర్వాత చేసిన రంగ రంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఉప్పెనతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్ కు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

చదవండి: రూ. 3 కోట్ల ఖర్చుతో “తండేల్” పాట..!

ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఎన్ని కథలు విన్నా నచ్చలేదని నో చెప్పేవాడు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఎస్ చెప్పాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కృష్ణ చైతన్య. ఇటీవల విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది. ఈ మూవీ విశ్వక్ కు మంచి పేరు తీసుకురావడంతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు విశ్వక్ సేన్. అయితే.. విశ్వక్ బిజీగా ఉండడంతో సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది. ఈలోగా వైష్ణవ్ తేజ్ కు కథ చెప్పడం.. ఈ కథ నచ్చడం జరిగిందని సమాచారం. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సివుంది. మరి.. ఈ సినిమాతో అయినా వైష్ణవ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Hot this week

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 30మందికిపైగా మావోలు మృతి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో అలజడి ఎదురుకాల్పుల్లో 30మందికిపైగా మావోలు మృతిమావోల కంచుకోటలో అలజడి రేగింది....

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..? హర్షసాయిపై బాధితురాలు మరో కంప్లైంట్‌..! ఇంతకీ...అత్యాచార ఆరోపణలు...

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్‌..

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీఎం..! కొత్త ఇల్లు చూసుకుని వెళ్లిపోయిన...

అధికారంలోకి వచ్చాక.. పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల

అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల తిరుపతి వారాహిసభ వేదికగా...

“దళపతి 69” మూవీ లాంఛ్

తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న సినిమాగా...

Topics

“రాజా సాబ్” టార్గెట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది...

నందిగం సురేష్‌కు హైకోర్టులో బెయిల్‌

వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్‌..! నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట..! గత ఐదేళ్ల జగన్‌...

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..!

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..! మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడికేసులో తాను అమాయకుడిని...