చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “తంగలాన్” డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో “తంగలాన్” సినిమాను రిలీజ్ చేస్తామని ఈ ఓటీటీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రిపబ్లిక్ డేకు రిలీజ్ కావాల్సిన “తంగలాన్” ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయ్యింది. మరింత బెటర్ క్వాలిటీ కోసమే రిలీజ్ వాయిదా వేశామని మూవీ టీమ్ చెబుతోంది.
ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.