ప్రొడ్యూసర్ శిరీష్ కొడుకు, యంగ్ హీరో ఆశిష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని వివాహం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ బిజినెస్ మేన్ కూతురు అద్వైత రెడ్డితో వచ్చే నెల 14న రాజస్థాన్ లోని జైపూర్ లో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎన్టీఆర్ కు అందజేశారు దిల్ రాజు.
సోదరుడు శిరీష్, కూతురు హర్షిత, కొడుకు హర్షిత్ తో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన దిల్ రాజు ఆయనకు పెళ్లి పత్రిక అందించి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దిల్ రాజు ఎన్టీఆర్ ను ఆహ్వానించిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రౌడీ బాయ్స్ తో ఆశిష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆయన హీరోగా మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.