హీరో నాని సినిమాలంటే నిర్మాత దిల్ రాజుకు నమ్మకం ఎక్కువ. నాని సినిమాలు మినిమమ్ బాగుంటాయని దిల్ రాజు నమ్ముతారు. నాని హీరోగా పలు మూవీస్ ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు…ఆయన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరాను డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు పొందారు దిల్ రాజు.
ఇప్పుడు ఇదే నమ్మకంతో నాని లేటేస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ తెలంగాణ, ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు తీసుకున్నారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.