టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించే రెండో సినిమాకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గీతా ఆర్ట్స్ విత్ బోయపాటి శ్రీను అంటూ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ప్రకటన చేశారు. మాసివ్ ఫోర్సెస్ స్ట్రోమింగ్ వన్స్ అగైన్ అంటూ ట్వీట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ త్వరలో ప్రకటిస్తామంటూ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ తో సరైనోడు వంటి మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ చేశారు దర్శకుడు బోయపాటి. ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్ లో మైల్ స్టోన్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ తో పాటు కేరళ, నార్త్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సినిమా మీద కొన్ని ఎవర్ గ్రీన్ రికార్డ్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా గురించి కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే బోయపాటి అల్లు అర్జున్ కు కథ చెప్పి ఒప్పించారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది.